ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష తెదేపా లేకుండానే సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఎన్నికలు నిర్వహించలేం...
పీటీఐ కథనం ప్రకారం.. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తీర్మానంలో పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిపింది. కరోనా రెండో దశ పొంచి ఉందని.. ఇలాంటి స్థితిలో ప్రజల భద్రతే ముఖ్యమని స్పష్టం చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని వివరించింది.