ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌తో ముస్లింలు అభద్రతాభావంతో ఉన్నారని.. మంత్రి అంజాద్ భాషా అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేయబోమని సీఎం ప్రకటించారు. 2010, 2015లో ఎన్పీఆర్ జరిగిందని, ప్రస్తుత ఎన్పీఆర్‌లో తల్లిదండ్రుల పుట్టిన స్థలం, తేదీ, మాతృభాష తదితరాలపై అభ్యంతరాలున్నాయి. 2010 నాటి ఫార్మాట్ ప్రకారం దాన్ని అమలుచేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. అప్పటివరకు దీన్ని ఆపాలి’ అని కోరారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.
* ‘మైనారిటీలు ఎన్‌ఆర్‌సీపై అభద్రతాభావంతో ఉన్నారని సీఎం జగన్ దృష్టికి రాగానే ఏపీలో దాన్ని అమలు చేయబోమని చెప్పారు. ఇప్పుడు మాట నిలబెట్టుకుని ముస్లింల్లో అభద్రతాభావాన్ని పోగొట్టారు’ అని కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, శిల్పా, గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నారు.
- చేపల పెంపకం అభివృద్ధికి సంస్థ
ఏపీ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు బిల్లును పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు ప్రవేశపెట్టారు. 8 మేజర్ షిప్పింగ్ హార్బర్లు ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.
- 15 బిల్లుల ఆమోదం