ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్.. తొలి ఓటు వేయనున్న సీఎం జగన్​ - రాష్ట్రపతి ఎన్నికలు

PRESIDENTIAL ELECTIONS: రాష్ట్రపతి ఎన్నికలకు ఏపీ అసెంబ్లీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ముఖ్యమంత్రి జగన్ తొలి ఓటు వేయనున్నారు.

PRESIDENTIAL ELECTIONS
PRESIDENTIAL ELECTIONS

By

Published : Jul 18, 2022, 7:32 AM IST

PRESIDENTIAL ELECTIONS:రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ తొలి ఓటు వేయనున్నారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వైకాపా తరపున బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు.

ప్రతిపక్ష తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా ముందుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బృందంగా శాసనసభ కార్యాలయానికి చేరుకుని ఓటింగ్‌లో పాల్గొననున్నారు. వైకాపా, తెలుగుదేశానికి చెందిన ఎంపీలు మాత్రం పార్లమెంట్‌లోనే తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఏర్పాట్లను రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్ భారతి పరిశీలించారు..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details