రాష్ట్రంలో పేదలకు జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. మూడేళ్లలో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లని చెప్పినా.. 30 లక్షల మందికి ఇళ్లిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా ఇబ్బంది పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదన్న ఆయన..పేదలకు రైతు భరోసా నుంచి ఇళ్ల వరకు ఇది సాకారం అవుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే 26.76 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని కన్నబాబు తెలిపారు. ఇళ్ల కోసం మరో 6.18 లక్షల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. గజం రూ.20 వేలు ఉన్నచోట భూములు కొని పేదలకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.