ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

TOP NEWS
TOP NEWS of ap

By

Published : Apr 22, 2022, 8:57 PM IST

  • సున్నా వడ్డీ పథకంతో.. కోటి రెండు లక్షల మందికి లబ్ధి: జగన్
    ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్​​ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధులను బటన్‌ నొక్కి సీఎం జగన్​ విడుదల చేశారు. రూ. 1,262 కోట్ల సున్నా వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లో వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత
    విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం ఘటనను వ్యతిరేకిస్తూ.. బాధిత కుటుంబసభ్యులు, తెలుగుదేశం నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అత్యాచార బాధితురాలి పరామర్శకు వచ్చిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను మహిళలు అడ్డుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలి: చంద్రబాబు
    విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు
    సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర.. టార్గెట్ మోదీ​!
    జమ్ముకశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటనే లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన ఆత్మాహుతి దళంలోని ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​-బ్రిటన్​ సరికొత్త స్నేహగీతం
    ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షోభాల వేళ ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడానికి భారత్‌- బ్రిటన్‌ అంగీకరించాయి. దిల్లీలో భేటీ అయిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శత్రు దేశాల అధినేతల 'ప్రేమ లేఖలు'- అసలు లక్ష్యం అదేనా?
    బద్ధ శత్రు దేశాలైన ఉత్తర కొరియా- దక్షిణ కొరియా మధ్య ఊహించని పరిణామం జరిగింది. ఇరు దేశాధినేతలు పరస్పరం లేఖలు రాసుకున్నారు. ముఖ్యంగా దైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావన వచ్చినట్లు అక్కడి అధికారిక మీడియాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రెడిట్, డెబిట్​ కార్డ్స్​కు కొత్త రూల్స్..
    క్రెడిట్, డెబిట్​ కార్డుల జారీపై రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 2022 జులై 1 నుంచి అమలు కానున్న ఈ నిబంధనలతో సేవల్లో పారదర్శకత మెరుగవుతుందని ఆర్బీఐ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇర్ఫాన్ పఠాన్-​ అమిత్​ మిశ్రా ట్విట్టర్​ వార్​..
    దేశ భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్​ పఠాన్​ చేసిన ఓ ట్వీట్​ మాటల యుద్ధానికి దారి తీసింది. ఇర్ఫాన్​ ట్వీట్​కు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు క్రికెటర్​ అమిత్​ మిశ్రా. ఇంతకీ ఆ ట్వీట్​ ఏమిటి?.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వసూళ్ల వేటలో దూసుకెళ్తున్న 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2'
    కన్నడ స్టార్ హీరో యశ్​, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో విడుదలైన సినిమా 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మరోవైపు, రాజమౌళి దర్శకత్వంలో తారక్​, చెర్రీ హీరోలుగా రిలీజైన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం కూడా కలెక్షన్లతో దూసుకెళ్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details