రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని.... నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన మాట వాస్తవమేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. అయితే 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా రద్దయిపోయిందని.. తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి లోక్‌సభలో బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, 14వ ఆర్థికసంఘం సిఫార్సులు, నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడి నివేదికల ఆధారంగా ప్రత్యేక సాయం ప్రకటించామని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 2015-2016 నుంచి 2019-2020 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న విదేశీ ఆర్థికసాయ ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలు, వడ్డీలను తిరిగి చెల్లింపు రూపంలో కేంద్రమే భరించడానికి సంసిద్ధమైందని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి ఏమన్నారంటే..! - ఏపీ ప్రత్యేక హోదాపై అనురాగ్ ఠాకూర్ వార్తలు
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా... 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ ప్రక్రియ రద్దైందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్న మంత్రి.. విదేశీ ఆర్థికసాయ ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలు, వడ్డీలు చెల్లింపునకు సంసిద్ధంగా ఉందని లోక్‌సభలో ఆయన ప్రకటించారు.
ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..!