పాలన అంటే టిక్ టాక్‌లో పాటలు పాడటం కాదని... ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణిని ఉద్ధేశించి తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. అమరావతిలో రైతల ఆందోళనకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి తన గాజులు ఇవ్వడంపై... వైకాపా నేతలు చేసిన విమర్శలను ఆమె తప్పుబట్టారు. ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మహిళ సంయమనం పాటించి మాట్లాడాలని హితవు పలికారు.
'పాలన అంటే టిక్ టాక్ లో పాటలు పాడటం కాదు' - పాలన అంటే టిక్ టాక్ లో పాటలు పాడటం కాదు
రాజధాని రైతుల దుస్థితి చూసి చలించిన భువనేశ్వరి తన చేతి గాజులు ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. రైతుల దీక్షకు మద్దతిచ్చిన భువనేశ్వరిపై విమర్శలు తగవని హెచ్చరించారు. పరిపాలన అంటే టిక్‌టాక్‌లు కాదనే విషయాన్ని మంత్రి పుష్పశ్రీవాణి తెలుసుకోవాలని సూచించారు.
!['పాలన అంటే టిక్ టాక్ లో పాటలు పాడటం కాదు' anuradha-comments-on-pushpa-srivani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5569678-thumbnail-3x2-anu.jpg)
anuradha-comments-on-pushpa-srivani
పుష్పశ్రీవాణి టిక్ టాక్ వీడియోపై అనురాధ కౌంటర్
ఇవీ చదవండి: