ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌ - సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌

సీజేఐ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ వెల్లడించారు.

రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌
రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌

By

Published : Aug 17, 2022, 9:12 AM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ 'ఈనాడు-ఈటీవీ భారత్'​కు వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ఆయనను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్వీ.రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.

ఆయనకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు. విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సముచితమంటూ.. ఈ అరుదైన అవకాశం వర్సిటీకి దక్కడంపై ఆచార్య రాజశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఏఎన్‌యూలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలోనూ వీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి స్నాతకోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్న విషయంపై జస్టిస్‌ ఎన్వీ.రమణకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ హాజరవుతారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details