ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐపీఎల్​ బెట్టింగ్​ కేసులో.. అనిశా అధికారుల దర్యాప్తు ముమ్మరం

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో సంచలనం సృష్టించిన ఐపీఎల్​ బెట్టింగ్​ కేసులో అవినీతి నిరోధక శాక అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోదాల్లో దొరికిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న అధికారులు.. ఇప్పటికే సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్​ను రిమాండ్​కు పంపారు.

IPL betting case in kamareddy
ఐపీఎల్​ బెట్టింగ్​ కేసులో.. అనిశా అధికారుల దర్యాప్తు ముమ్మరం

By

Published : Nov 30, 2020, 10:58 PM IST

ఐపీఎల్​ బెట్టింగ్​ కేసులో.. అనిశా అధికారుల దర్యాప్తు ముమ్మరం

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి ఐపీఎల్​ బెట్టింగ్​ కేసులో అనిశా దర్యాప్తు కొనసాగుతోంది. సోదాల్లో దొరికిన ఆధారాలతో ఇప్పటికే సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్​ను రిమాండ్​కు పంపారు.

బెట్టింగ్​ కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రపై విచారించిన అనిశా అధికారులు.. సోదాల సమయంలో పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐటీ, ఈడీ శాఖలకు వివరాలు అందించి, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. గొలుసుకట్టు, లక్కీ డ్రా, ఇతర దందాల్లో నిందితులు, అధికారుల పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఐటీ, ఈడీ అధికారులు విచారణ చేపట్టే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details