ACB Raids: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్‌గా పనిచేస్తున్న సంపత్.. ఓ వ్యక్తికి సంబంధించి భూమి సర్వే చేసేందుకు రూ. 3 లక్షలు లంచం అడిగారు. అందుకు ఒప్పుకొన్న వ్యక్తి ముందుగా రూ. లక్ష ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అనిశా అధికారులు నిఘా పెట్టారు. ఆ వ్యక్తి నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా అధికారులు సంపత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అనిశా వలలో అవినీతి చేప.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్ - అనిశా వలలో చిక్కిన అంతర్గాం తహసీల్దార్ సంపత్
ACB Raids: తెలంగాణలో అనిశా వలకు అవినీతి చేప చిక్కింది. తహసీల్దార్ రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌తో పాటు మరో ఇద్దరు.. అధికారుల అదుపులో ఉన్నారు.
అనిశా వలలో అవినీతి చేప