మహిళా ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి సౌకర్యం పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతుల కార్యాలయాల మహిళా ఉద్యోగులకు వర్తించనుంది. హైదరాబాద్ నుంచి వచ్చే మహిళా సిబ్బందికి ఉచిత వసతి సౌకర్యం వర్తిస్తుంది. విజయవాడ, గుంటూరు కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా సిబ్బందికి కూడా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి
మహిళా ఉద్యోగులకు మరో ఏడాది ఉచిత వసతి సౌకర్యం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చే మహిళా సిబ్బంది, విజయవాడ, గుంటూరు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఇది వర్తించనుంది. 2021 జూన్ 31వ వరకు ఉచిత వసతి సౌకర్యం పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2021 జూన్ 31వ వరకు ఉచిత వసతి సౌకర్యం పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020 ఆగస్టు 1తో ఉచిత వసతి సౌకర్యం గడువు ముగిసింది. రెయిన్ ట్రీపార్కులో ఉన్న 3 బెడ్‌రూమ్ ఫ్లాట్లలో ఆరుగురు ఉద్యోగినులు చొప్పున ఉండాలని ప్రభుత్వం సూచించింది. రెయిన్ ట్రీపార్కులో ఉన్న 2 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లలో నలుగురు చొప్పున ఉండాలని స్పష్టం చేసింది. 3 నెలలకోసారి పరిస్థితిని అంచనావేసి ఫ్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండీ... 'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'