ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని అమరావతిలో ఇద్దరు రైతులు మృతి - రాజధాని కోసం ఆగిన మరో రెండు గుండెలు

రాజధాని అమరావతిలో ఇద్దరు రైతులు మృతి చెందారు. తుళ్లూరు మండలానికి చెందిన పాతూరి హైమావతి అనే మహిళా రైతు, వీర రాఘవులు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు.

Another woman farmer died in Amravati.
అమరావతిలో ఆగిన మరో మహిళా రైతు గుండె

By

Published : Dec 21, 2020, 8:09 AM IST

Updated : Dec 21, 2020, 9:17 AM IST

అమరావతి రాజధాని ఉద్యమంలో మరో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడానికి చెందిన పాతూరి హైమావతి(58) సోమవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. అమరావతి నిర్మాణానికి హైమావతి ఎకరం భూమి ఇచ్చారు. ఉద్యమ ప్రారంభం నుంచి హైమావతి చురుగ్గా పాల్గొంటోంది రోజూ తమతో ఉద్యమంలో పాల్గొన్న మహిళ ఒక్కసారిగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

తుళ్లూరు మండలం అనంతవరంలో వీర రాఘవులు(65) అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. వీర రాఘవులు రాజధాని నిర్మాణానికి 60 సెంట్లు భూమి ఇచ్చారు.

Last Updated : Dec 21, 2020, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details