రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం - Another sensational decision by the andhrapradesh government
పంచాయతీరాజ్ శాఖలో పనులు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పనులు ప్రారంభమై 25 శాతానికి మించని వాటినీ సమీక్ష చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
![రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4090432-86-4090432-1565359112822.jpg)
రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 58.64 కోట్లు విలువైన ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పలు జిల్లాలో 144 పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు మినహా మిగతా జిల్లాలో పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని వాటినీ సమీక్ష చేయాలని నిర్ణయించింది.