పశ్చిమ నైరుతి మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం మీదుగా కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఆగ్నేయ బంగాళా ఖాతం ప్రాంతాల మీదుగా నవంబర్ 9వ తేదీన నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర - యానాం ప్రాంతాలు
ఈరోజు, రేపు ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తాంధ్ర