అమరావతిలో.. ఆగిన మరో గుండె - అమరావతిలో మహిళా రైతు మృతి
jainub bee
22:54 January 12
అమరావతి పరిధిలో మరో మహిళా రైతు ప్రాణం విడిచింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన జైనూబ్ బీ.. అనే 58 ఏళ్ల మహిళ.. మృతి చెందారు. ఆమె.. రాజధాని నిర్మాణం కోసం 2.15 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇటీవల అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న ఊహాగానాలు, అనంతరం ఉద్ధృతంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు కుటుంబీకులు చెప్పారు. ఆ ఆందోళనతోనే..తుది శ్వాస విడిచారని ఆవేదన చెందారు.
Last Updated : Jan 12, 2020, 11:39 PM IST