ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి - కల్తీకల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి

తెలంగాణలోని వికారాబాద్​ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. మూడు రోజుల క్రితం వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో కల్తీకల్లు తాగి.. 309 మంది అస్వస్థతకు గురయ్యారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

died
కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి

By

Published : Jan 11, 2021, 4:11 PM IST

వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. నవాబ్‌పేట్ మండలం వట్టిమినేపల్లిలో ఇవాళ ఉదయం కొమురయ్య(90) మరణించారు. మూడు రోజుల క్రితం వికారాబాద్, నవాబ్‌పేట్ మండలాల్లో కల్తీకల్లు తాగి.. 309 మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు.

మూడు రోజుల క్రితం పెండ్లిమడుగు వాసి కృష్ణారెడ్డి(62) మృతి చెందగా.. తాజాగా కొమురయ్య మృతి చెందారు. ఈ విషయమై ఎక్సైజ్​ అధికారులు విచారణ చేపట్టారు. కల్తీ కల్లు బాధిత గ్రామాల్లో వైద్య శాఖ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:స్పీడ్ బ్రేకర్ వద్ద ట్రాక్టర్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details