కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది క్రమంగా అల్పపీడన ప్రాంతంగా మారుతుందని అమరావతి వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ప్రత్యేకించి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా. రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర అంతటా కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ప్రాంతం | వర్షపాతం |
చినగంజాం (ప్రకాశం ) | 6.1 సెంటిమీటర్లు |
కడియం (తూ.గో) | 5.4 సెంటిమీటర్లు |
ఏలేశ్వరం (తూ.గో) | 4..2 సెంటిమీటర్లు |
నిడుదవోలు (ప.గో) | 4.0 సెంటిమీటర్లు |
తణుకు (ప.గో) | 3.5 సెంటిమీటర్లు |
హనుమాన్ జంక్షన్(కృష్ణా) | 4.4 సెంటిమీటర్లు |
నూజివీడు(కృష్ణా) | 1.5 సెంటిమీటర్లు |
మైదుకూరు (కడప ) | 4.3 సెంటిమీటర్లు |
జమ్మలమడుగు(కడప) |