ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: పుట్టి మునిగిన ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం - నారాయణపేట జిల్లా కురువపురం తాజా వార్తలు

తెలంగాణలోని జూరాల జలాశయంలో బుధవారం రెండు మృతదేహాలు.. తాజాగా గురువారం మరో మృతదేహం లభ్యమైంది. ఇంకో పాప కోసం వెతుకుతున్నారు. ఈనెల 17న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల నుంచి కురువపురం వెళ్తున్న పుట్టి పంచదేవుపాడు వద్ద కృష్ణా నదిలో మునిగింది. ప్రమాదంలో నలుగురు గల్లంతయ్యారు.

deadbody
మృతదేహం లభ్యం

By

Published : Aug 20, 2020, 10:25 AM IST

మృతదేహం లభ్యం

జూరాల ప్రాజెక్ట్ గేట్ల దగ్గర మరో మహిళ మృతదేహం లభ్యమైంది. పాప కోసం ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ఈనెల 17న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల నుంచి కురువపురం వెళ్తున్న పుట్టి కృష్ణా నదిలో పంచదేవుపాడు వద్ద మునిగింది. ఆ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు.

ప్రమాదంలో వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు బ్యాక్​వాటర్​లో ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. బుధవారం రెండు మృతదేహాలు దొరికాయి. ఇంకో చిన్న పాప కోసం వేతుకుతున్నారు. అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఇదీ చూడండి :తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details