ఏపీ ఉద్యోగులు తెలంగాణలో విధుల్లో చేరేందుకు వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగుల పత్రాలను తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాస తగులబెట్టింది. ఆరేళ్లుగా విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య రెండు రాష్ట్రాల మధ్య నలుగుతోందని.. ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొండిగా వ్యహరిస్తున్నాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అధ్యక్షుడు శివాజి అన్నారు. ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా అక్కడి విద్యుత్ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆరోపించారు.
ఏపీ ఉద్యోగుల్ని రిలీవ్ చేసిన పత్రాలు కాల్చివేత - tjac
విద్యుత్ ఉద్యోగుల పంపకాలపై తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య మళ్లీ వివాదం మెుదలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రా నుంచి ఒక్క ఉద్యోగినీ ఇక్కడ అడుగుపపెట్టనివ్వమని టీజాక్ హెచ్చరించింది. తెలంగాణకు ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆంధ్రా విద్యుత్తు సంస్థలు జారీ చేసిన ఉత్తర్వులను దహనం చేశారు.
power-companies
ఒక్క ఏపీ ఉద్యోగిని కూడా రానివ్వకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని తెలిపారు. సోమవారం ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. దీనిపై ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. 584 మందిని రిలీవ్ చేయడం ధర్మాధికారి తీర్పునకు వ్యతిరేకమని... ధర్మాధికారే ఏపీ విద్యుత్ సంస్థలకు తీర్పు అర్థం అయ్యేలా చూడాని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 28కి చేరిన కరోనా అనుమానితులు