కొత్త ఆధార్ నమోదు, పాత కార్డుల్లో సమాచారం అప్డేట్ చేసుకోవటం కోసం తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో.. 120 పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలు ఉన్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ తెలిపారు.
5 లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన వారు తప్పనిసరిగా వేలి ముద్రలను అప్డేట్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సేవలను ఆయా కేంద్రాల్లో అందించనున్నట్లు వెల్లడించారు. సమాచారం అప్డేట్ కోసం వచ్చేవారు రూ.50, వేలి ముద్రలు / ఐరిస్ సేవల అప్డేట్ కోసం రూ.100 ఛార్జీ వసూలు చేయనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ వివరించారు.