ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చింతమనేనిపై ఐదో కేసు నమోదు..14 రోజుల రిమాండ్. - chintamaneni prabhakar latest news

తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై మరో కేసు నమోదైంది. ఓ వ్యక్తిని నిర్బంధించి కొట్టిన కేసులో పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు జిల్లా ఎక్సైజ్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

another case file on ex mla chinthamaneni prabhakar

By

Published : Oct 7, 2019, 3:30 PM IST

Updated : Oct 28, 2019, 8:32 AM IST


దెందులూరు మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. పెదవేగిలో మోడికొండ మురళీకృష్ణ అనే వ్యక్తిని నిర్బంధించి కొట్టాడని ఫిర్యాదు అందింది. 2018లో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరు కారాగారంలో ఉన్న చింతమనేనిని జిల్లా ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఇప్పటికే 4 కేసుల్లో చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉండటంతో తాజాగా మరో కేస నమోదు చేశారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

చింతమనేనిపై ఐదో కేసు నమోదు..14 రోజుల రిమాండ్.
Last Updated : Oct 28, 2019, 8:32 AM IST

ABOUT THE AUTHOR

...view details