రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీనితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. లండన్ నుంచి విశాఖ వచ్చిన యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ తేలిందని వెల్లడించింది. మరో కరోనా కేసు నమోదు కావటంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. అతను ఎక్కడెక్కడా తిరిగాడన్న వివరాలను సేకరిస్తోంది. ఇతనితో సహా విశాఖలో వైరస్ పీడితుల సంఖ్య మూడుకు చేరింది.
కరోనా అలర్ట్... ఏపీలో మరో పాజిటివ్ కేసు నమోదు - ఏపీలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. లండన్ నుంచి విశాఖకు వచ్చిన అతనికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
carona cases in ap
Last Updated : Mar 23, 2020, 11:57 PM IST