ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో 5 రెవెన్యూ డివిజన్లు - formation of new districts latest news

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్నీ ఓ జిల్లాగా ప్రకటించేందుకు వీలుగా ఏర్పడిన కమిటీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై రెవెన్యూశాఖ అధ్యయనం చేస్తోంది.

Another 5 Revenue Divisions for the formation of new districts
కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో 5 రెవెన్యూ డివిజన్లు

By

Published : Nov 8, 2020, 5:09 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు, 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇందులో 23 రెవెన్యూ డివిజన్లు ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉండగా... మిగిలిన 28 డివిజన్లు రెండు కొత్త జిల్లాల పరిధిలోకి వస్తున్నాయి. వీటిని సర్దుబాటును చేసేందుకు అదనంగా 5 డివిజన్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీనికి ముందు పోలీసుశాఖలో ఉన్న 81 సబ్‌ డివిజన్లు హద్దులనూ పరిశీలించారు. ప్రస్తుతం ఒకే మండలంలోని కొన్ని గ్రామాలు... రెండేసి అసెంబ్లీ లేదా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉంటున్నాయి. ముందుగా వీటిని సర్దుబాటు చేయటంపై అధికారులు దృష్టి సారించారు.

అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ప్రకటిస్తారు. జిల్లాల ఏర్పాటు పురోగతిపై వారంలోగా సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. అప్పుడు వెలువడిన ఆదేశాలను బట్టే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు తీసుకునేందుకు నెలరోజులు గడువు ఇచ్చి... దాదాపు 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండీ... 'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details