ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు.. ఏడుగురు మృతి - covid impact in telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా 3052 కేసులు నిర్ధరణ కాగా.. వైరస్ బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వైరస్
corona cases in telangana

By

Published : Apr 13, 2021, 10:18 AM IST

తెలంగాణలో రెండో దశ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం.. 1,13,007 మందికి కొవిడ్​ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,052 మందికి వైరస్ పాజిటివ్​గా ఫలితం వచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 406 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3,32,581కు చేరింది.

కొవిడ్​ కోరల్లో చిక్కి మరో ఏడుగురు మరణించగా.. ఇప్పటి వరకు 1,772 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి తాజాగా మరో 778 మంది బాధితులు కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 16,118 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్​ కేసులున్నాయి.

ABOUT THE AUTHOR

...view details