రాష్ట్రంలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీ కరనా వార్తలు
13:48 June 07
75కి చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 199 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే 69 ఉండగా.. రాష్ట్రంలో 130 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 75కి చేరింది.
రాష్ట్రంలో 17,695 కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా...ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,718గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 30 మంది డిశ్చార్జి అయ్యారు. మెుత్తం మీద ఇప్పటివరకు 2,353 మంది డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రుల్లో 1,290 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇవీ చదవండి:అమానవీయ రీతిలో కరోనా మృతుని ఖననం