తెలంగాణలో కొవిడ్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. జిల్లాల్లోనూ కేసుల సంఖ్య అదుపులోకి వచ్చేలా లేదు. తాజాగా రాష్ట్రంలో 1478 మందికి కొవిడ్ సోకగా... అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 806 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య.. 42 వేల మార్కు దాటింది.
తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు...7 మరణాలు - తెలంగాణలో కరోనా మరణాలు
తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 42,496కు చేరింది. తాజాగా 7 మృతి చెందారు.
corona cases
తాజాగా వచ్చిన పాజిటివ్ కేసులతో కలిపి ఇప్పటి వరకు 42,496 మంది కరోనా బారిన పడ్డారు. శుక్రవారం 1,410 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 28,705 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. తాజాగా 7 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 403 మంది మహమ్మారికి బలయ్యారు.
ఇదీ చూడండి :అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు.. చిక్కని మావోయిస్టులు
Last Updated : Jul 18, 2020, 6:08 AM IST