భాజపా రాష్ట్ర పదాధికారుల నూతన కమిటీని.... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులతో నూతన కమిటీ ఏర్పడినట్లు తెలిపారు. పదాధికారుల కార్యవర్గంలో చోటు దక్కించుకున్న వారికి సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ట పరచాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
భాజపా రాష్ట్ర పదాధికారుల నూతన కమిటీ ప్రకటన - bjp state president somu veeraju news
భాజపా రాష్ట్ర పదాధికారుల నూతన కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులతో నూతన కమిటీలను ఏర్పాటు చేశారు.
ఉపాధ్యక్షులుగా... రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మీ, మాలతి రాణి, జయరాజు, వేణుగోపాల్, విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి, రావెల కిషోర్‌బాబు, సురేందర్‌రెడ్డి, చంద్రమౌళిలు.... ప్రధాన కార్యదర్శులుగా... పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్, లోకుల గాంధీ, సూర్యానారాయణ రాజు, మధూకర్లు నియమితులయ్యారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సురేంద్ర మోహన్, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా నిర్మల కిశోర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా శశి భూషణ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా దేవానంద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా శివనారాయణ నియమితులయ్యారు.
ఇదీ చదవండి:పీఎంవో డిప్యూటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి