ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు '

By

Published : May 27, 2021, 9:52 PM IST

కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం, వసూళ్లపై తనిఖీలు నిర్వహించామన్నారు.

ak singhal
ak singhal

కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఫీజులు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం, వసూళ్లపై తనిఖీలు నిర్వహించినట్లు చెప్పిన ఆయన.. కొన్ని చోట్ల పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయన్నారు.

అలాంటి ఆసుపత్రులకు జరిమానాలు విధించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:AP Corona Casess: రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details