బ్లాక్ ఫంగస్ వ్యాధిని నోటిఫై చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ కేసులు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. వీటి ఆధారంగా బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రభావం రాష్ట్రంలో ఎంత ఉంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని.. మరణాలు మాత్రం సంభవించలేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారికి ఉచితంగా ఈ వైద్య సేవలూ అందుతాయని వెల్లడించారు.
కరోనా కారణంగా మరణించిన వారి పిల్లలు అనాథలు కాకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయబోతుందని వెల్లడించారు. 24 గంటల్లో 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అవసరమైన మందులు, ఇంజెక్షన్ల కొనుగోలుకు స్వల్పకాలిక టెండర్లు పిలవబోతున్నాం. ప్రతి బోధనాసుపత్రిలో బ్లాక్ ఫంగస్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. కర్ఫ్యూ విధించడం వల్ల 2 జిల్లాల్లో కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి’ అని అన్నారు.
3 రోజుల్లో 91 వేల మంది జ్వర పీడితుల గుర్తింపు