ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంగన్వాడీ సూపర్​వైజర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ రద్దు: అనురాధ - శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ

ANGANWADI : అంగన్వాడీ సూపర్‌వైజర్ల నియామక నోటిఫికేషన్‌ రద్దు చేస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధ తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారని ఆమె వివరించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే నోటిఫికేషన్‌ రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ANGANWADI
ANGANWADI

By

Published : Sep 30, 2022, 10:07 PM IST

ANGANWADI : అంగన్వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌-2) (పదోన్నతి పరీక్ష) నియామకం నోటిఫికేషన్‌ రద్దు చేశామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ తెలిపారు. నోటిఫికేషన్‌ రద్దు చేసేందుకు సీఎం జగన్‌ కూడా అంగీకరించారని చెప్పారు. న్యాయనిపుణుల సలహా మేరకు నోటిఫికేషన్‌ రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఫలితాలను నిలుపుదల చేశామని వెల్లడించారు. 55,607 అంగన్వాడీలు ఉండగా.. ప్రతి 25 అంగన్వాడీలకు ఒక సూపర్‌ వైజర్‌ ఉండాలి. ప్రస్తుతం అంతర్గతంగా చేపట్టిన నియమాక నోటిఫికేషన్‌లో 60 అంగన్వాడీలకు ఒక సూపర్‌ వైజర్‌ మాత్రమే ఉన్నారని, దీంతో 560 అంగన్వాడీ సూపర్‌ వైజర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది.

దాదాపు 21వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. మొత్తం 50 మార్కులకుగాను 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు స్పోకెన్‌ ఇంగ్లీష్ టెస్ట్‌ నిర్వహించినట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే, 21వేల మంది స్పోకెన్‌ ఇంగ్లిష్ వీడియో చూడాలంటే కష్టం కాబట్టీ .. మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారు మాత్రమే స్పోకెన్‌ ఇంగ్లీష్ విడియోలు అప్‌లోడ్‌ చేయాలని అధికారులు సూచించారు. రూల్‌ ఆప్‌ రిజర్వేషన్‌ ప్రకారం పరీక్ష నిర్వహించామని, ఫలితాల వివరాలు ఎక్కడా బయటపెట్టలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక కీ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదలను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 1190 మంది అభ్యర్థుల నుంచి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ వీడియోలు తెప్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details