వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (ఫ్రీ స్కూల్స్) ప్రారంభించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. మూడు నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల కోసం ఈ కేంద్రాలు తెరవనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇవి నిర్వహిస్తారు. వీరికి మధ్యాహ్నం భోజనంతో పాటు పాలు ఇతర పౌష్టికాహార అందజేస్తారు. ఇందుకుగాను రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే మార్గదర్శకాలను జిల్లా కార్యాలయం ద్వారా మండలాలకు చేరాయి.
వచ్చే నెల ప్రారంభం నుంచి అంగన్వాడీల్లో ఫ్రీ స్కూల్స్ ప్రారంభం - పాఠశాల విద్యాశాఖ తాజా వార్తలు
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (ఫ్రీ స్కూల్స్) ప్రారంభం కానుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు పాలు ఇతర పౌష్టికాహారాన్ని అందజేయనున్నట్లు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం నుంచే ఆరు నుంచి పదో తరగతుల విద్యార్థులకు పూర్తిస్థాయిలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.
ఫ్రీ స్కూల్స్ ప్రారంభం
రాష్ట్రంలో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకు ఈనెల 27 నుంచి పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బోధన జరుగుతుంది. తరగతుల నిర్వహణలో కరోనా వైరస్ నిబంధనలు విధిగా పాటించాలని అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.