ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంగన్‌వాడీ ఆయా రాక్షసత్వం... చిన్నారిపై దారుణంగా - ap latest updates

Inhumanity in Anganwadi: చిన్నపిల్లలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. సమాజం తలదించుకునేలా పిల్లలపై దాడులు జరుగుతున్నాయి. అసలు ఇంతటి దారుణానికి ఎలా చేతులు వచ్చాయో తెలియడం లేదు.. ఇంతకీ ఏమిటా నీచపుచర్యా..

Anganwadi ayamma
అంగన్‌వాడీ ఆయా రాక్షసత్వం

By

Published : Sep 16, 2022, 2:56 PM IST

Anganwadi: పాపం ఆ చిన్నపిల్ల ఏం చేసింది... అభం శుభం తెలియని పిల్లలపై ఎందుకీ ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఉన్న పిల్లలు గుర్తుకు వస్తే.. ఇలాంటి పనులు చేయడం మానివేస్తారు. సభ్యసమాజం తలదించుకునేలా చిన్నారిపై అమానుష ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలంలో జరిగింది.

మధిర శివాలయం రోడ్డులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోని పని చేస్తున్న 'ఆయా' రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. చిన్నారి తరచూ మూత్రానికి వెళ్తోందని మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టింది. చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో... ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపను ఇబ్బందిపెట్టిన అంగన్‌వాడీ ఆయాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

"నాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. పిల్లలందరూ అంగన్​వాడీకి వెళుతున్నారు. ఆ అంగన్​వాడీలో విధులు నిర్వహిస్తోన్న 'ఆయా' పిల్లలు ఎప్పుడు మూత్ర విసర్జన చేసిన సరే కొడుతూ, తిడుతూ ఉండేది. పెద్ద పాప తరచూ మూత్రానికి వెళ్తోందని తిట్టి, మర్మాంగంలో గోర్లతో గాట్లు పెట్టింది. అక్కడ తీవ్రగాయం కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా రక్తస్రావం ఆగడంలేదు. పాప నొప్పి అని ఏడుస్తూనే ఉంది". - పాప తల్లి


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details