రాజధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై రోజువారీ తుది విచారణ కొనసాగింది. రాజధానిని మార్చటం రాజ్యాంగ ధిక్కరణేనని సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ రైతుల తరపు వాదించారు. రాజధానిలో పలు భవనాలు నిర్మాణాలకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇవాళ మధ్యాహ్నం వరకు రాజధాని అంశాలపై విచారణ జరిపిన కోర్టు... తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
రాజధానిని మార్చటం రాజ్యాంగ ధిక్కరణే... అమరావతి కేసులో వాదనలు - three capitals for ap
రాజధాని అమరావతిని మార్చటం రాజ్యాంగ ధిక్కరణే అని సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ రైతుల తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధాని వ్యాజ్యాలపై విచారించిన త్రిసభ్య ధర్మాసనం... తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Andhra Pradesh High Court
TAGGED:
ఏపీ హైకోర్టు తాజా వార్తలు