ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూజీ, పీజీ పరీక్షలకు సన్నద్ధం..!

యూజీ, పీజీ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే షెడ్యూల్‌ విశ్వవిద్యాలయాలు పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించేశాయి.

By

Published : Aug 29, 2020, 8:37 AM IST

ready for ug, pg examinations
ready for ug, pg examinations

అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాది పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా మారింది. సెప్టెంబ‌రు 30లోపు వీటిని పూర్తి చేయాలని గతంలో యూజీసీ ఆదేశాలు జారీ చేయగా.. కరోనా దృష్ట్యా రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటే సమయం పెంపు కోసం యూజీసీని సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. సమయం పెంపు కోసం యూజీసీని అడిగే విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఒక పక్క కరోనా ఉద్ధృతి.. మరోపక్క పరీక్షలు నిర్వహిస్తామనడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. చాలాచోట్ల వర్సిటీల్లోని వసతిగృహాలు, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో క్వారంటైన్‌ కేంద్రాలుగా కూడా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉన్నత విద్యాశాఖ అయా విశ్వవిద్యాలయాలకే అప్పగించింది. ఈ మేరకు కొన్ని వర్సిటీలు పరీక్షల షెడ్యూళ్లు ఇవ్వగా.. మరికొన్ని త్వరలో ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ఉండేందుకు విద్యార్థుల నివాసాలకు సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఆఫ్‌లైన్‌ వైపే మొగ్గు

పరీక్షలను ఆన్‌లైన్‌ లేదా పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించుకోవచ్చని యూజీసీ సూచించింది. రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని వర్సిటీలు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేకపోవడం, అంతర్జాల సమస్య కారణంగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నాయి.

  • జేఎన్‌టీయూ అనంతపురం సెప్టెంబరు మూడు నుంచి పరీక్షలు ప్రారంభించనుంది.
  • జేఎన్‌టీయూ, కాకినాడ సెప్టెంబరు రెండో వారం నుంచి ప్రారంభించాలని భావిస్తోంది.
  • శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ సైతం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఈ వర్సిటీలో 5నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
  • నాగార్జున వర్సిటీలో ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తికాగా మిగతావి సెప్టెంబ‌రు 2నుంచి ప్రారంభం కానున్నాయి.
  • శ్రీవేంకటేశ్వర వర్సిటీ సెప్టెంబరు 7నుంచి నిర్వహిస్తోంది.
  • ఆంధ్రా యూనివర్సిటీ ఇంకా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.
  • అంబేడ్కర్‌ వర్సిటీ పరిధిలో పీజీ చివరి ఏడాది వారికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఎప్పటి నుంచి నిర్వహిస్తారన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు.

ABOUT THE AUTHOR

...view details