వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసుశాఖ మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. ఎందరో ప్రాణాలు కాపాడి... అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంలో పోలీసుశాఖ చొరవ ప్రశంసనీయమన్నారు. లోతట్టు ప్రాంతాలు వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్లు,ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకొని పని చేయడం అభినందనీయమన్నారు. డయల్ 100/112 సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
24 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి: పోలీసు శాఖకు డీజీపీ సూచన - rains in Andhrapradesh
ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి డీజీపీ సూచించారు. ఇప్పటి వరకు సేవలు అందిస్తున్న వారిని అభినందించిన ఆయన... 100/112 సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
24 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి: పోలీసు శాఖకు డీజీపీ సూచన