రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,876 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 97 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 179 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కోటీ 32 లక్షల 76 వేల 678 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 97 కరోనా కేసులు.. ఒకరు మృతి - andhrapradesh carona bulletin latest
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 97 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 179 మంది కోలుకోగా.. ఒకరు మరణించారు. మరో 1,071 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
![రాష్ట్రంలో కొత్తగా 97 కరోనా కేసులు.. ఒకరు మృతి andhrapradesh carona bulletin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10513942-164-10513942-1612534621507.jpg)
రాష్ట్రంలో కొత్తగా 97 కరోనా కేసులు, ఒకరు మృతి
8 లక్షల 88 వేల 275 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8 లక్షల 80 వేల 46 మంది మహమ్మారి నుంచి కోలుకోగా..7,158 మంది మృతి చెందారని వివరించింది. ఇప్పటికీ.. 1,071 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.