ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై ఏకపక్ష నిర్ణయం సరికాదు: కోడెల

అమరావతి విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

By

Published : Aug 21, 2019, 1:39 PM IST

అమరావతిపై ఏకపక్ష నిర్ణయం సరికాదు: కోడెల

అమరావతిపై ఏకపక్ష నిర్ణయం సరికాదు: కోడెల

రాజధానిని మార్చాలనే ప్రభుత్వ ఆలోచన సరికాదని, ఇటువంటివి భవిష్యత్తుపై ప్రభావం చూపే ప్రమాదముందని మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. అమరావతి తరలింపు, పోలవరం పనుల నిలుపుదల, రివర్స్ టెండరింగ్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సమీక్షించడం వంటి నిర్ణయాలు ఆంధ్రా అభివృద్ధికి ఆటంకాలుగా నిలిచే ప్రమాదముందని చెప్పారు. "ఇటువంటి ప్రజావ్యతిరేక, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికేనా.. కోట్లాదిమంది మీకు అధికారం కట్టబెట్టింది" అంటూ ఘాటుగా స్పందించారు. ప్రజలు మెచ్చుకునేలా పరిపాలన చేయాలే తప్ప... ఎవరిపైనో కక్ష్యసాధింపు ధోరణితో వెళ్తే రాష్ట్రానికే నష్టమని చెప్పారు. అమరావతి ప్రాంతానికి ఇప్పుడు వెళితే.. స్మశానంలో నడుస్తున్నట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాల్లో అందరి అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details