సులభతర వాణిజ్యం విభాగంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకొంది. రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు తమ జోరు కొనసాగించాయి. ఏపీ వరుసగా రెండోసారి తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి చేరింది. రెండో స్థానాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ఆక్రమించింది. గతంలో 12 స్థానంలో ఉన్న యూపీ ఈసారి రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. లాక్‌డౌన్ సందర్భంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్‌ను అమలు చేయడంలోనూ అన్నింటికన్నా ఏపీనే ముందుంది. 2019 మార్చి 31వరకు రాష్ట్రాలు అమలుచేసిన సంస్కరణలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని మదించి ర్యాంకులు విడుదల చేసింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్ - ap top in ease of doing business
16:24 September 05
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ టాప్‌లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ ఆగ్రస్థానంలో నిలించింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానం, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి.
ఈ సందర్భంగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచిన ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీలో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో అదనంగా రూ.20లక్షల కోట్ల పారిశ్రామికోత్పత్తే లక్ష్యమన్నారు. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని చెప్పారు. వన్ ప్రొడక్ట్ - వన్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంపై రాష్ట్రాలతో కలిసి కార్యాచరణ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లా స్వయం సమృద్ధి సాధించాలనేదే కేంద్రం లక్ష్యమన్నారు. ప్రతి జిల్లా తమ వనరుల మేరకు సొంత ఉత్పత్తులపైనే దృష్టిపెట్టాలని సూచించారు. సులభతర వాణిజ్యంలో ఐదేళ్లలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిదని చెప్పారు. సహకారం అందిస్తూ పోటీతత్వం పెంచడం ద్వారా పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ చర్యలతో 2025 నాటికి 5 ట్రిలియన్‌డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరతామని చెప్పారు.
నిర్మాణ రంగంలో ఆన్‌లైన్ అనుమతులు మరింత సులభతరం చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ అన్నారు. నిర్మాణ రంగంలో 2057 పట్టణాల్లో ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. సుభతర వాణిజ్యంలో 2017లో 185వ స్థానంలో ఉన్నామనీ.. 2020 నాటికి 158 స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి చేరుకున్నట్టు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: