ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఐపీఎల్ 2021

ప్రధాన వార్తలు @ 9 AM

Top News
Top News

By

Published : Apr 10, 2021, 9:00 AM IST

  • రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా...9 రోజుల్లోనే రెట్టింపు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో కంటే ఏప్రిల్‌లో కేసులు మరింత పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లోనే వీటి సంఖ్య రెట్టింపు అయింది.మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వల్ల వైరస్‌ కోరలు చాస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధానికి సీఎం లేఖ

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 25 లక్షల డోసుల టీకా అవసరం అవుతుందని..... ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్‌

గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా? అని అడిగారు.. ఇప్పుడు మేం చేస్తాం. మీకు ఆ దమ్ము ఉందా.?’ - చంద్రబాబు, తెదేపా అధినేత పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • మావోయిస్టుల కదలికలపై.. యూఏవీలతో నిఘా..!

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ - సుకుమా జిల్లాల మధ్య తాజాగా జరిగిన మారణకాండలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం.. అత్యాధునిక సాంకేతికతో కూడిన మానవ రహిత గగన వాహనాల (యూఏవీ) వినియోగ అవసరాన్ని మరోమారు చర్చకు తెచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'కోబ్రా' జవాన్​ విడుదలలో వారిదే కీలక పాత్ర

కోబ్రా జవాన్​ రాకేశ్వర్​ సింగ్​ మన్హాస్ భార్య, కుమార్తె కన్నీళ్లు చూసే మావోయిస్టులను కలిశామని జవాన్​ను విడిపించటంలో కీలక పాత్ర పోషించిన విశ్రాంత ఉపాధ్యాయుడు బోరయ్య 'ఈటీవీ భారత్'​కు తెలిపారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష

దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్​ గ్రాడ్యుయేట్​ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. మొత్తం 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • టీకా పంపిణీలో అసమానత్వంపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

కరోనా వ్యాక్సిన్​ ప్రక్రియలో అసమానత్వం కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని దేశాలకు సమానంగా టీకా అందించాలని అభిప్రాయపడ్డారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • వీడియో గేమ్​ ఆడిన కోతి.. మస్క్​ ట్వీట్​!

ఆలోచనలతో యంత్రాలను నడిపించగల టెక్నాలజీపై చేస్తోన్న పరిశోధనల్లో ముందడుగు పడింది. న్యూరాలింక్​ కంపెనీ.. ఓ కోతికి కొద్దివారాల ముందు చిప్​ను అమర్చగా.. ఆ కోతి వీడియో గేమ్ తీరును గమనించింది. తన ఆలోచలతో వీడియో గేమ్​ను ఆడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ద్రవిడ్​కు కోపం.. రోడ్డుపై అరుస్తూ హల్​చల్!

ప్రశాంతతకు మారు పేరైన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్​ ద్రవిడ్​కు కోపమొచ్చింది. అంతే 'ఇందిరానగర్ గుండానురా నేను' అంటూ రోడ్డుపై హల్​చల్ చేశాడు. అదేంటో మీరూ చూసేయండి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ట్రాఫిక్ ఎస్సై, బైక్​ రేసర్ మధ్య పోటాపోటీ!

కథానాయకుడు సిద్ధార్థ్​, జీవీ ప్రకాశ్​ కలిసి నటిస్తున్న చిత్రం 'ఒరేయ్​ బామ్మర్ది'. ఇందులో ట్రాఫిక్ ఎస్సైగా సిద్ధార్థ్​.. బైక్ రేసర్​గా జీవీ ప్రకాశ్​ తెరపై కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్​ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details