ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @9AM - ఏపీ ముఖ్యవార్తలు

.

9AM TOP NEWS
9AM TOP NEWS

By

Published : Dec 22, 2020, 9:00 AM IST

  • ఆన్​రిజర్వుడు కోటా భర్తీలో పొరపాటు..నేడు మళ్లీ కేటాయింపు

ఎంబీబీఎస్‌లో ద్వితీయ కౌన్సెలింగ్‌ ద్వారా చేసిన సీట్లు కేటాయింపు రద్దయింది. ఆన్‌రిజర్వుడు కేటగిరీలో సీట్ల కేటాయింపులో తలెత్తిన పొరపాటును వర్శిటీ అధికారులు గుర్తించారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా 175 సీట్ల కేటాయింపును రద్దు చేశారు. ఇవాళ మళ్లీ సీట్లను కేటాయించనున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • విచారణ నుంచి వైదొలగాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేయడమా..?

చివరి శ్వాస వరకు న్యాయవ్యవస్థను కాపాడతానని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఎవర్నీ అనుమతించబోనని... ఈ నెల 31 వరకు భయం, పక్షపాతానికి తావు లేకుండా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తానని ఉద్ఘాటించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • మావోయిస్టుల చెరలో బాలుడు.. ఆలస్యంగా వెలుగులోకి!

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో బాలుడు అపహరణకు గురయ్యాడు. నవంబర్‌లో కొందరు మావోయిస్టులు ఇంటికి వచ్చి బలవంతంగా తమ బిడ్డను తీసుకెళ్లారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • భోగాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

భోగాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కారులో మంటలు- ఐదుగురు సజీవ దహనం

ఉత్తర్​ప్రదేశ్​లో విషాదం చోటుచేసుకుంది. యమునా ఎక్స్​ప్రెస్​వే పై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్​ రూట్​లో వస్తున్న ఓ కంటైనర్​ను ఓ వాహనం ఢీకొట్టింది. అనంతరం ఆ కారులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే వాహనంలోని ఐదుగురు సజీవనం దహనానికి గురయ్యారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఏఎంయూ శతాబ్ది ఉత్సవాల్లో మోదీ ప్రసంగం

అలీగఢ్​ ముస్లిం విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయనున్నారు మోదీ. అనంతరం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్​-2020ను ప్రారంభించనున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కమ్ముకొస్తున్న డ్రాగన్​- భారత్​ పరిస్థితి ఏంటి?

సామ్రాజ్య విస్తరణే లక్ష్యమంటూ విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. భారత్​తో కూాడా అదే ధోరణి కొనసాగిస్తోంది. కొన్ని నెలలుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నా.. డ్రాగన్ అందుకు సుముఖంగా లేదు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'చిన్న పరిశ్రమలకు కావాలి మరింత చేయూత'

కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఆత్మనిర్భర్​ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2020 మేలో మూడు లక్షల కోట్ల రూపాయల అత్యవసర రుణహామీ పథకాన్ని రూపొందించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'టీమ్​ఇండియా తిరిగి పుంజుకోవడం కష్టమే'

తొలిటెస్టులో ఘోర పరాజయం తర్వాత సిరీస్​లో టీమ్ఇండియా తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రాడ్​ హాడిన్​. షమీ లేకపోవడం వల్ల భారత బౌలింగ్​లో సరైన వనరులు లేవని తెలిపాడు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • మిస్టరీ డ్రామాలో పోలీసు అధికారిణిగా పాయల్​

కథానాయిక పాయల్​ రాజ్​పుత్​ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం '5 డబ్ల్యూస్‌'. పరిశోధనాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు సినిమా గురించి ముచ్చటించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details