ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - andhrapradesh latest news

.

top news
ప్రధాన వార్తలు

By

Published : Dec 1, 2020, 11:01 AM IST

  • లైవ్ అప్​డేట్స్: కొనసాగుతున్న బల్దియా పోలింగ్.. ఓటేస్తున్న ప్రముఖులు
    హైదరాబాద్​ నగర పాలక ఎన్నికలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రైతు బీమా ప్రీమియంపై రాత్రికి రాత్రే జీవోనా?: అచ్చెన్నాయుడు
    రైతు బీమా ప్రీమియం చెల్లించినట్లు జీవో విడుదల చేయటంపై వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పంట నష్టపోయాక, రైతులు మరణించాక పరిహారం చెల్లిస్తే లాభమేంటని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఏడాదిన్నరగా పేదలకు ఇళ్లను ఎందుకు స్వాధీనం చేయలేదు?: నిమ్మల
    దేపా హయాంలో కట్టిన పేదల ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వినియోగదారులకు స్వల్ప ఊరట...తప్పిన విద్యుత్ ఛార్జీల భారం
    2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్‌ ఛార్జీల ప్రతిపాదనలను.... రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఏపీఈఆర్​సీకి అందించాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 వేల 911 కోట్ల నష్టాలు వస్తాయని నివేదించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నేటితో తుంగభద్ర పుష్కరాలు పరిసమాప్తం
    తుంగభద్ర పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. కార్తిక సోమవారం సందర్భంగా ఘాట్లలో నిన్న భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశంలో కొత్తగా 31,118 మందికి కరోనా
    దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 31,118 మందికి కొవిడ్​ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 94లక్షల 62వేల 810కు చేరింది. వైరస్​ కారణంగా మరో 482 మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉపాధి కల్పనే మాంద్యానికి మందు
    ఉరుములేని పిడుగులా మానవాళిపై కరోనా వైరస్‌ విజృంభణ దరిమిలా దేశీయంగా ఉపాధి రంగం పెద్ద కుదుపునకు లోనయింది. అసంఖ్యాక వలస కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా మూలాలపై దర్యాప్తును రాజకీయం చేయొద్దు'
    కొవిడ్​-19 వైరస్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి స్పష్టంగా ఉందని పునరుద్ఘాటించారు ఆ సంస్థ చీఫ్​ టెడ్రోస్​ అథనోమ్​. వైరస్​ మూలాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అది భవిష్యత్తు మహమ్మారులను నివారించేందుకు దోహదపడుతుందని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కోహ్లీ ఇకనైనా మేలుకో.. లేదంటే అంతే!
    2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు, ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయాలను అందుకుంది. దీంతో అంతవరకూ ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను అందుకున్నాడంటూ కోహ్లి పేరు మార్మోగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బరువు తగ్గినందుకు గిఫ్ట్​గా లగ్జరీ కారు
    లాక్​డౌన్​లో బరువు తగ్గి ఫిట్​గా మారినందుకు నటుడు శింబుకు తన తల్లి ఓ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. దాని విలువ దాదాపు రూ.50లక్షలు ఉండొచ్చని తెలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details