ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM - telugu latest news

.

TOP NEWS 9AM
TOP NEWS 9AM

By

Published : Nov 28, 2020, 9:00 AM IST

  • రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలు

రైతుల రెక్కల కష్టాన్ని నివర్‌ తుపాను నీళ్లపాలు జేసింది. రాయలసీమతోపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అన్నదాతలను ఆశల సాగును నిండాముంచింది. వేల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిలో నానుతుంది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రెండు వారాల్లో 2 వాయుగుండాలు..!

వచ్చేనెల 10వ తేదీలోపు బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు ఏర్పడేందుకు అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఓ అల్పపీడనం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది 30వ తేదీలోపు వాయుగుండంగా మారి, ఆ తర్వాత మరింత బలపడే అవకాశాలున్నాయని వెల్లడించారు. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. విహంగ వీక్షణం ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పర్యటించి వరద నష్టంపై ఆరా తీయనున్నారు.పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'డిసెంబరు 31లోగా నివర్ నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయం'

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం డిసెంబరు 31లోగా నష్టపరిహారాన్ని చెల్లించనుంది. ఇందుకోసం డిసెంబరు 15 కల్లా నష్టపరిహారాన్ని నిర్ధారించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించింది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నేడు తితిదే పాలకమండలి భేటీ...ఆర్థిక పరిస్థితులపై చర్చ

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ఇవాళ జరగనుంది. కరోనా ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు అనుమతి, ఆరున్నర కిలోల బంగారంతో శ్రీవారి ఆలయ మహాద్వార తలుపులకు తాపడం వంటి పలు కీలక అంశాలపై పాలకమండలి భేటీలో చర్చనుంది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నేడు మూడు నగరాలకు మోదీ-టీకాపై సమీక్ష

భారత్​లో కరోనా టీకాను అభివృద్ధి చేస్తోన్న భారత్ బయోటెక్, సీరం, జైడస్ క్యాడిలా సంస్థలను నేడు సందర్శించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం ఆయన ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్​లో పర్యటించనున్నారు.పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఇక వాహనాలకూ నామినీ సౌకర్యం

వాహనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకు ఖాతాలు, బీమాల తరహాలో వాహనాలకు కూడా నామినీ సౌకర్యాన్ని కల్పించేలా.. కొత్త నిబంధలను తీసుకొచ్చింది. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • చైనా కంట్లో తైవాన్‌ నలుసు!

"తైవాన్​ ఎప్పటికీ మాలో అంతర్భాగమే. దాని స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించే ప్రసక్తే లేదు. సంపూర్ణ విలీనానికి అంగీకరించని పక్షంలో సైనికదాడికీ వెనకాడం" అని చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • బెయిర్​స్టో వీరవిహారం.. టీ20లో ఓడిన దక్షిణాఫ్రికా

ఇంగ్లాండ్​ చేతిలో తొలి టీ20లో ఓటమి పాలైంది దక్షిణాఫ్రికా. ఆకట్టుకునే బ్యాటింగ్​తో విజయాన్ని అందించిన బెయిర్​స్టో.. విజయానికి కారణమయ్యాడు.పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • గాంధీని హత్య చేసిన గాడ్సేపై సినిమా

గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలం ఆధారంగా సినిమా తీస్తున్నారు. దీనికి 'మరణ వాగ్మూలం' టైటిల్​ను నిర్ణయించారు. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.పుర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details