- రాష్ట్రంలో కొత్తగా 3,342 కరోనా కేసులు, 22 మరణాలు
రాష్ట్రంలో తాజాగా 3,342 మందికి కొవిడ్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 8,04,026కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 22 మంది మృతి చెందారు. కాగా ఇప్పటివరకు వైరస్ కారణంగా 6,566 మంది ప్రాణాలు విడిచారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉండబోతోంది: చంద్రబాబు
కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారితో చంద్రబాబు వెబినార్ నిర్వహించారు. కరోనా కేసుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఏపీలో పాజిటివ్ రేటు 10.91 శాతం.. జాతీయస్థాయి సగటు రేటు 7.87 శాతంగా ఉందన్న చంద్రబాబు... కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాల్లో 5 ఏపీలోనే ఉన్నాయని వివరించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మా ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం: అవంతి
వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తన పదవీకాలం పూర్తవుతోందని ఎన్నికలు జరపాలనుకోవడం తప్పని హితవు పలికారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పోలవరాన్ని ముంచేందుకే 22 ఎంపీ సీట్లు గెలిచారా..?: దేవినేని ఉమా
పోలవరాన్ని ముంచేందుకే 22మంది ఎంపీ సీట్లు గెలిచారా..? అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. సీఎం జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే పోలవరం ప్రాజెక్ట్‌ను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇంద్రకీలాద్రిపై అకట్టుకుంటున్న కేరళ వాద్యం
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయ బద్దంగా, అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఆ రాష్ట్రాల్లో అత్యాచారాలపై కాంగ్రెస్ మౌనమేల?'
పంజాబ్ హోషియార్‌పుర్‌లో జరిగిన ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చనిపోయిన వారిలో 18 గంటల పాటు వైరస్ సజీవం!
కర్ణాటకలోని ఆక్స్ఫర్డ్ ఆస్పత్రి వైద్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. కరోనా సోకి చనిపోయిన వ్యక్తి శరీరంలో 18 గంటల పాటు వైరస్ సజీవంగా ఉంటుందని తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాజ్‌భవన్ ఎదుట డీఎంకే భారీ ఆందోళన
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ నివాసం ఎదుట.. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే నిరసనకు దిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెడికల్ విద్యలో అంతర్గత రిజర్వేషన్ బిల్లుపై ఆమోదంలో జాప్యానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దిల్లీపై కోల్‌కతా అదిరిపోయే విజయం
తమ ఆటగాళ్ల సమష్టి కృషితో దిల్లీపై కోల్‌కతా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో నితీశ్ రానా(81 పరుగులు), బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి(5-20) అదరగొట్టారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మెహందీ ఆర్టిస్ట్‌గా సాయిపల్లవి.. సమంత,అనుపమ కామెంట్
హీరోయిన్ సాయిపల్లవి మెహందీ ఆర్టిస్ట్‌గా మారింది. సహచర కథానాయికలు సమంత, అనుపమ ఆ వీడియోపై కామెంట్లు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి