ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ap letter to central government: 'కృష్ణా నదిపై ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తేవాలి' - కృష్ణా బోర్డు వివాదం

కృష్ణా ప్రధాన నదిపై ఉన్న ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరనుంది. రెండు రోజుల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాయనున్నామని సోమవారం జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Andhra Pradesh to write letter to Central Government
Andhra Pradesh to write letter to Central Government

By

Published : Aug 10, 2021, 8:19 AM IST

కృష్ణా ప్రధాన నదిపై ఉన్న ప్రాజెక్టులనే బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరనుంది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులను మాత్రమే గెజిట్‌ నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలుకు పరిమితం చేయాలని సూచించనుంది. గోదావరిలో కూడా ప్రధాన నది నుంచి నీటిని తీసుకొనే ప్రాజెక్టులను మాత్రమే చేర్చాలని కోరనుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో మార్పులు కోరనున్నామని, రెండు రోజుల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాయనున్నామని సోమవారం జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో ఏపీ ప్రభుత్వం తెలిపింది. విశ్వసనీయవర్గాల సమాచారం ఏపీ కోరనున్న మార్పులు ఇలా ఉన్నాయి.

  • వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో ఉండాలి. నిర్మాణంలో ఉన్న, ఏపీ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో ప్రాజెక్టులను మొదటి షెడ్యూలులో చేర్చాలి. పునర్విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను గుర్తించి మొదటి షెడ్యూలులో చేర్చాలి. బోర్డుల పరిధిలోకి తెచ్చే రెండో షెడ్యూలులో ప్రధాన కృష్ణాపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను చేర్చాలి.
  • శ్రీశైలం, సాగర్‌లలో అన్ని ఔట్‌లెట్లపైన, విద్యుదుత్పత్తి కేంద్రాలు సహా కృష్ణాబోర్డు ఆధీనంలో ఉండాలి. ఒకసారి బోర్డు నిర్ణయం మేరకు నీటిని విడుదల చేస్తే, ఆ రాష్ట్రం తన అవసరాలకు తగ్గట్లుగా ఎక్కడైనా నీటిని వాడుకోవచ్చు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, బ్రాంచి కాలువలను షెడ్యూలు-2లో చేర్చాలి. ఏపీ వాటా సక్రమంగా వెళ్లేలా బోర్డు చూడాలి. మిగిలిన అన్ని ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాలే నిర్వహించుకొనేలా షెడ్యూలు-3లో ఉంచాలి.
  • గోదావరిలో శ్రీరామసాగర్‌, ఎల్లంపల్లి, కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, దుమ్ముగూడెం, సీతారామ ఎత్తిపోతలను రెండో షెడ్యూలులో చేర్చాలి. పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టును ఇదే షెడ్యూలులో ఉంచాలి. మిగిలిన అన్ని ప్రాజెక్టులను ఆయా ప్రభుత్వాల నిర్వహణలో ఉండేలా చూడాలి. ఉమ్మడి రిజర్వాయర్లేవీ లేనందున పోలవరం సహా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులను మూడో షెడ్యూలులో చేర్చాలి.

ABOUT THE AUTHOR

...view details