ఉత్తర అండమాన్ తీరాన్ని అనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కోసాగుతోందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది(low pressure news). రాగల 48 గంటల్లో ఇది మరింత బలపడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 18 తేదీ నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ కోస్తాంధ్ర- ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో (rains in ap nnews)చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.
RAIN ALERT: అల్పపీడన ప్రభావం.. కోస్తాంధ్ర, సీమ జిల్లాలకు వర్షసూచన - ఏపీకి వర్ష సూచన
ఉత్తర అండమాన్ తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఫలితంగా తమిళనాడు తీర ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు (rain alert for AP news)కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
RAIN ALERT