Poor People in Telugu States 2021: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వారు 12.31% మేర ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల స్థితిగతులను తెలుసుకోవడానికి నీతి ఆయోగ్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ఆధారంగా రూపొందించిన బహుముఖ పేదరికం నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక సంఖ్యలో పేద రాష్ట్రాలుగా బిహార్ (5101 శాతం), ఝార్ఖండ్ (12.16), ఉత్తర్‌ప్రదేశ్ (91.70) తొలి మూడు స్టానాల్లో నిలిస్తే ఆంధ్రప్రదేశ్ 20, తెలంగాణ18వ స్థానాల్లో నిలిచాయి. కేరళలో (0.11%) అతి తక్కువ పేదలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక బహుముఖ పేదలు కర్నూలు, అతి తక్కువగా గుంటూరు జిల్లాలో ఉన్నట్లు వెల్లడించింది.
ఇప్పటివరకు పేదరికాన్ని అంచనా వేసేందుకు ఆదాయం, వినిమయం,ఖర్చులనే పరిగణనలోకి తీసుకుంటూ వచ్చారు. అయితే... పూర్తిగా ఆదాయం మీదే ఆధారపడి పేదరికాన్ని అంచనా