ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిమితులకు మించి అప్పులు..

Debits: దసరా పండుగ అంటేనే సందడి. కానీ, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల ముఖాల్లో పండుగ కళ కనిపించడం లేదు. నాలుగో తారీఖు వచ్చినా చాలా మందికి ఇంకా జీతాలే అందలేదు. వేతనాలు అందకుండా వేడుకలు ఎలా చేసుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉద్యోగులది. మరోవైపు.. అప్పు తెస్తే కానీ, జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వానిది. అందుకే తాజాగా మరో 2 వేల కోట్లు ఆర్‌బీఐ నుంచి సేకరించింది. దీంతో ఈ ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర అప్పు అప్పుడే 50 కోట్లకు చేరుకుంది.

debits
రాష్ట్ర ప్రభుత్వ అప్పు

By

Published : Oct 4, 2022, 8:46 AM IST

Updated : Oct 4, 2022, 11:47 AM IST

AP Debits: ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని మించి అప్పులు చేస్తోంది. మూడో తేదీ వచ్చినా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేదు. అప్పు తెస్తే కానీ జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. రిజర్వు బ్యాంకు సోమవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రూ. 2,000 కోట్ల రుణం తీసుకుంది. దీంతో ఒక్క బహిరంగ మార్కెట్‌లోనే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏకంగా 39,890 కోట్లు రుణం తీసుకున్నట్లయింది. ఇవి కాకుండా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నుంచి 8,300 కోట్లు, కేంద్ర రుణాలుగా 1,400 కోట్లు, నాబార్డు నుంచి కొంత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

పరిమితులకు మించి అప్పులు

కేంద్ర ఆర్థికశాఖ తొలి 9 నెలల కాలంలో మొత్తం 43,803 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న రుణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి చేర్చి లెక్కిస్తామని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పింది. అలా చూస్తే రాష్ట్రం మొత్తం అప్పు ఇప్పటికే 50 వేల కోట్లకు చేరుకుంది.

ఇవీ చదవండ:

Last Updated : Oct 4, 2022, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details