మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణల ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. నామినేషన్ ఉపసంహరణ కోసం నిర్దేశించిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా దీనిపై వివరాలు పంపించాలని సూచించింది.
పుర పోరు: బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై ఎస్ఈసీ స్పష్టత - sec clarity on ap municipal elections nominations
మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగితే..వాటిపై ఫిర్యాదులు స్వీకరించి ఎస్ఈసీకి చెప్పాలని సూచించింది.
ap sec on municipal elections
అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగి ఉంటే అలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎస్ఈసీకి నివేదించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఉపసంహరణ జరిగితే వాటిని పునఃపరిశీలించి.. పునరుద్ధరిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ