అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ ఆంధ్రప్రదేశ్‌లో ఏటా వేల మందిని బలి తీసుకుంటోంది. 2019లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 90.75శాతం, మరణాల్లో 92.68శాతం ఈ రెండు కారణాలవల్లే జరిగాయి. రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 2.36 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా రోజుకు సగటున 21.87 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏపీ వాటా 4.72శాతం. అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది. 2018తో పోలిస్తే 2019లో ఏపీలో స్వల్పంగా ప్రమాదాలు తగ్గాయి. నగరాలపరంగా చూస్తే అంతకు ముందేడాదితో పోలిస్తే విజయవాడలో తగ్గుముఖం పట్టగా.. విశాఖపట్నంలో పెరుగుదల నమోదైంది. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదలచేసిన ‘ప్రమాద మరణాలు- ఆత్మహత్యల సమాచార నివేదిక-2019’ ఈ వివరాలను వెల్లడించింది.
జాతీయ రహదారులపై అధిక మరణాలు
* మొత్తం రోడ్డు ప్రమాద మృతుల్లో 37.53 శాతం మంది (2,997 మంది) జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
* ద్విచక్ర వాహనాలవల్ల జరుగుతున్న ప్రమాదాల్లోనే అత్యధికంగా 3,012 (37.72శాతం) మంది ప్రాణాలు కోల్పోయారు.
* మొత్తం ప్రమాదాల్లో 18,765 (90.75శాతం) అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌వల్లే జరుగుతున్నాయి. మొత్తం మరణాల్లో 7,400 (92.68శాతం) ఈ రెండు కారణాలతోనే జరుగుతున్నాయి.
గంటకు 2 రోడ్డు ప్రమాదాలు..దేశంలో ఏపీకి 9వ స్థానం
దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏపీ వాటా 4.72శాతం. అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది. 2018తో పోలిస్తే 2019లో ఏపీలో స్వల్పంగా ప్రమాదాలు తగ్గాయి.
Andhra Pradesh