రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 44,679 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 203 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడి ఒకరు కృష్ణా జిల్లాలో మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,85,437కు చేరింది. గడిచిన 24 గంటల్లో 231 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,75,921 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 7,134 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,382 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,24,41,272 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
రాష్టంలో తాజాగా 203 మందికి కరోనా.. ఒకరి మృతి - నేటి కరోనా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,85,437 చేరింది. తాజాగా కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్టంలో తాజా కరోనా బులిటెన్